రెండు రోజుల పర్యటనలో భాగంగా లద్ధాఖ్ వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. హిందూ మత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ ఆలయంలో సుమారు గంటపాటు గడిపారు రాజ్నాథ్.
అమర్నాథ్ ఆలయంలో రాజ్నాథ్ పూజలు - Central Defense minister Rajnath Singh Amarnath
కశ్మీర్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. సుమారు గంటపాటు ఆలయంలో గడిపిన ఆయన.. అనంతరం సరిహద్దు పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన రాజ్నాథ్
శుక్రవారం సైనిక బలగాలతో సమావేశమైన రక్షణ మంత్రి.. సరిహద్దు భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సాయుధ దళాలను కోరిన రాజ్నాథ్.. ఇలాంటి చర్యలకు దీటుగా స్పందించాలని సూచించారు.
ఇదీ చదవండి:'కాంగ్రెస్ కార్యకర్తలారా.. వరద బాధితులను ఆదుకోండి'
Last Updated : Jul 18, 2020, 12:54 PM IST