తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 4:22 PM IST

ETV Bharat / bharat

చైనా బోర్డర్​లో కొత్త రోడ్​- సైన్యానికి మరింత వెసులుబాటు

చైనాతో కీలకమైన సరిహద్దు వెంబడి భారత్​ వ్యూహాత్మకంగా నిర్మించిన 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రారంభించారు. లిపులేఖ్​ పాస్​ నుంచి ఘటియాబాగఢ్​ను కలిపే ఈ రోడ్డు.. సైనిక అవసరాలను తీర్చడమే కాక మానస సరోవర్​ యాత్రా సమయాన్ని తగ్గించనుంది.

DEF-RAJNATH-ROAD
చైనా సరిహద్దుల్లో వ్యుహాత్మక రహదారి ప్రారంభం

ఉత్తరాఖండ్​లో వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉన్న రహదారిని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రారంభించారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్​ను కలిపేలా చైనా సరిహద్దు వెంబడి 80 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించారు.

కైలాస యాత్రకు తగ్గిన సమయం..

దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్​నాథ్​ సింగ్.. స్థానికులు, యాత్రికుల దశాబ్దాల కల నేరవేరిందని అన్నారు. టిబెట్​లోని కైలాస మానస సరోవర్​ యాత్రా సమయం ఈ రోడ్డు కారణంగా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఉత్తరాఖండ్​లోని ఘటియాబాగఢ్​ నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు లిపులేఖ్​పాస్​ వద్ద ముగుస్తుంది. అక్కడి​ నుంచి మానస సరోవర్​ 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా సరోవర్​ వెళ్లేందుకు 3 వారాలు పడుతుంది. ఈ మార్గం ద్వారా వారంలోనే యాత్రికులు సరోవర్​ను దర్శించుకోవచ్చు.

సైనిక అవసరాలు..

చైనా సరిహద్దు ఉన్న కీలకమైన ఈ ప్రాంతంలో భద్రతా దళాల తరలింపు సులభమవుతుందని సైనిక అధికారులు చెబుతున్నారు. కఠినమైన హిమాలయాల్లో తవాఘాట్​లోని మంగ్తి క్యాంప్​, వ్యాస్​ లోయలోని గుంజీతోపాటు సరిహద్దుల్లోని భద్రతా స్థావరాలకు ప్రయాణం సులభమవుతుంది.

2008లోనే ప్రారంభించిన ఈ రహదారిని 2013లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ నాజాంగ్​- బుండీ మధ్య కఠిన పరిస్థితుల కారణంగా నిర్మాణంలో ఆలస్యమైంది.

ABOUT THE AUTHOR

...view details