తూర్పు లద్దాఖ్ ఘటనతో దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాలపై దృష్టి కేంద్రికరించింది భారత్. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) రూ.43 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరు వంతెనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
"ప్రపంచం దేశాలు ఒకదానికొకటి భిన్నంగా, దూరంగా ఉండాలని భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో వంతెనలను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. వీటి నిర్మాణాన్ని సమర్థంగా పూర్తి చేసిన సరిహద్దు రోడ్డు సంస్థకు అభినందనలు. బీఆర్ఓ ఏర్పడినప్పటి నుంచి సరిహద్దుల్లోని సుదూర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పటికే అనేక నిర్మాణాలు ఎంతో నైపుణ్యంతో పూర్తి చేసింది."