తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇజ్రాయెల్​ రక్షణ మంత్రితో రాజ్​నాథ్ ఫోన్​ సంభాషణ - rajnath singh news

ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రితో ఫోన్లో సంభాషించారు రాజ్​నాథ్​ సింగ్. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు రాజ్​నాథ్​.

Rajnath Singh holds telephonic conversation with Israeli counterpart
ఇజ్రాయెల్​ రక్షణ మంత్రితో రాజ్​నాథ్ ఫోన్​ సంభాణష

By

Published : Jul 24, 2020, 5:21 PM IST

భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్​ తో టెలిఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

" రక్షణ రంగంలో ఇరుదేశాల పరస్పర సహకారంలో పురోగతిపై ఇజ్రాయెల్ మంత్రితో ఫోన్లో చర్చలు జరిపా. కరోనా పరిస్థితులపైనా మాట్లాడాం. వైరస్ కట్టడికి సంయుక్తంగా ఎలా పోరాడాలనే విషయంపైనా చర్చించాం."

-రాజ్​నాథ్​ సింగ్ ట్వీట్​.

సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది భారత్​. మోదీ సర్కారు రక్షణ రంగానికి ఇచ్చిన ఆర్థిక అధికారాల కింద ఇజ్రాయెల్​​ నుంచి హెరాన్​ నిఘా డ్రోన్లు, స్పైక్​ యాంటీ గైడెడ్​ క్షిపణులను అత్యవసరంగా దిగుమతి చేసుకునే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో దిగుమతి చేసుకున్న హెరాన్​ మానవరహిత ఏరియల్ వాహనాల సేవలను భారత​ సైన్యం ఇప్పటికే వినియోగిస్తోంది. లద్దాఖ్ సెక్టార్లో​ గస్తీ నిర్వహించేందుకు వీటిని విరివిగా ఉపయోగిస్తోంది. మరిన్ని ఆయుధ పరికరాలను ఇజ్రాయెల్​ నుంచి దిగుమతి చేసుకోనుంది.

ఇదీ చూడండి: హ్యామర్​ క్షిపణితో రఫేల్​కు మరింత శక్తి!

ABOUT THE AUTHOR

...view details