తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కే-9 వజ్ర' యుద్ధ ట్యాంకును ఆవిష్కరించిన రాజ్​నాథ్ - లార్సెన్ అండ్ టర్బో

సూరత్​లోని 'హజీరా లార్సెన్ అండ్ టర్బో' కర్మాగారంలో కే-9 వజ్ర-టీ యుద్ధ ట్యాంకును రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఆవిష్కరించారు. యుద్ధ ట్యాంకులో ప్రయాణించి పనితీరును పరిశీలించారు రాజ్​నాథ్. 'మేక్​ ఇన్​ ఇండియా' ద్వారా భారత్​ ఆయుధ ఎగుమతిదారుగా మారుతుందన్నారు.

Rajnath Singh flags off 51st K-9 Vajra at L&T gun making facility
కే-9 వజ్ర యుద్ధ ట్యాంకును ఆవిష్కరించిన రాజ్​నాథ్

By

Published : Jan 16, 2020, 9:55 PM IST

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ 51వ కే-9 వజ్ర-టీ యుద్ధ ట్యాంకును ప్రారంభించారు. సూరత్​లోని హజీరాలో ఉన్న 'లార్సెన్ అండ్ టర్బో' (ఎల్ ​అండ్ ​టీ) ఆయుధ వ్యవస్థ కర్మాగారంలో వీటిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ట్యాంకుపై స్వస్తిక్ ముద్రను వేసి ఆయుధ పూజ చేశారు రాజ్​నాథ్​. యుద్ధ ట్యాంకులో ప్రయాణిస్తూ పనితీరును పరిశీలించారు. ఒకప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం లేని రంగాల్లో రక్షణ రంగం ఒకటని.... కానీ ప్రస్తుతం 'మేక్​ ఇన్​ ఇండియా'లో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో భారత్ నికర​ ఆయుధ ఎగుమతిదారుగా మారుతుందని ఉద్ఘాటించారు.

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

"వజ్ర యుద్ధ ట్యాంకును చూసినప్పుడు అందులో ఓ పటిష్ఠమైన ఆయుధం మాత్రమే కాదు, పటిష్టమైన భారత్​ కూడా కనిపించింది. రక్షణ రంగంలో మేక్​ ఇన్​ ఇండియాకి ఇదో అద్భుతమైన ఉదాహరణ."-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

యుద్ధ ట్యాంకు విశేషాలు

50 టన్నుల బరువుండే ఈ యుద్ధ ట్యాంకు 47 కిలోల బాంబులను విసరగలదు. 43 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సున్నా వ్యాసార్థంలో ఈ ట్యాంకు తన చుట్టూ తాను తిరగగలడం మరో ప్రత్యేకత. మేక్​ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 2017లో ఎల్​అండ్​టీ సంస్థ రూ.4,500 కోట్ల రూపాయల కాంట్రాక్టును రక్షణ శాఖ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా 100 కే9 వజ్ర-టీ కేటగరీ యుద్ధ ట్యాంకులను 42 నెలల్లో ఆర్మీకి అందించనుంది. ఇప్పటివరకు 51 ట్యాంకులను ఆర్మీకి అందజేసింది. ఓ ప్రైవేటు సంస్థకు రక్షణ శాఖ ఇచ్చిన అతిపెద్ద కాంట్రాక్టు ఇదే కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details