తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లఖ్​నవూ నుంచి రాజ్​నాథ్​ సింగ్​ నామినేషన్​

భాజపా నేత, కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఉత్తరప్రదేశ్​ లఖ్​నవూ నియోజకవర్గం నుంచి నామినేషన్​ వేశారు. నగరంలో భారీ రోడ్​ షో చేపట్టారు.

By

Published : Apr 16, 2019, 3:26 PM IST

లఖ్​నవూ నుంచి రాజ్​నాథ్​ సింగ్​ నామినేషన్​

భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​సింగ్​ ఉత్తరప్రదేశ్​ లఖ్​నవూ నియోజకవర్గం నుంచి మరోమారు నామినేషన్​ దాఖలు చేశారు. అటల్​ బిహారీ వాజ్​పేయీ లాంటి దిగ్గజ నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ లోక్​సభ స్థానం నుంచి 2014లో ఎన్నికయ్యారు రాజ్​నాథ్​.

నామినేషన్​కు ముందు భారీ రోడ్​ షో చేశారు రాజ్​నాథ్​.

వాజ్​పేయీ ప్రభుత్వంలో మంత్రి..

ఉత్తరప్రదేశ్​లో జన్మించిన రాజ్​నాథ్​ సింగ్​ 1975లో జనసంఘ్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1977లో మీర్జాపుర్​ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి అయ్యారు. వాజ్​పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ, ఫుడ్​ ప్రాసెసింగ్​ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2013 వరకు రెండుసార్లు భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details