మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్(ఎంఈఎస్)లోని సాధారణ, పారిశ్రామిక సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 13,157 పోస్టుల్లో 9,304 పోస్టుల రద్దు ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది.
లెఫ్టినెంట్ జనరల్ శెకత్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు రాజ్నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రక్షణ శాఖ వెల్లడించింది. సాయుధ దళాల రక్షణ వ్యయాన్ని సమతుల్యం చేయటం, పోరాట సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపింది.