హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్మించిన అటల్ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మనాలి చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌తో కలిసి టన్నెల్ వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాజ్‌నాథ్ సమీక్షించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా మనాలి- లేహ్ మార్గంలో నిర్మించిన 3 కీలక వంతెనలను రాజ్‌నాథ్ మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లపై అధికారులను ఆరా తీస్తున్న రాజ్‌నాథ్ 17 మందికి కరోనా..
అటల్ సొరంగ మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇందులో పోలీసులు, పర్యాటక శాఖ ఉద్యోగులు, ప్రధాని కార్యాలయ డ్రైవర్లు ఉన్నారు.
టన్నెల్ ముఖద్వారం వద్ద రాజ్‌నాథ్ ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:అతిపొడవైన అటల్ సొరంగం- అత్యద్భుత నిర్మాణ కౌశలం