తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన రాజ్​నాథ్​ - కేంద్ర మంత్రి

నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించేముందు రాజ్​నాథ్​ సింగ్​.. దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. త్రివిధ దళాధిపతులతో కలిసి అమర జవాన్లకు నివాళులర్పించారు.

జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన రక్షణ మంత్రి

By

Published : Jun 1, 2019, 9:45 AM IST

రాజ్​నాథ్​ సింగ్​.. నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టేముందు దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళులర్పించారు.

జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన రక్షణ మంత్రి

త్రివిధ దళాధిపతులు బిపిన్​ రావత్​, బీఎస్​ ధనోవా, కరమ్​బిర్​ సింగ్​లు రాజ్​నాథ్​ వెంట​ ఉన్నారు.

నరేంద్ర మోదీ హయాంలో తొలిసారి రక్షణ శాఖ మంత్రిగా పనిచేయనున్నారు రాజ్​నాథ్​ సింగ్​. మొదటి దఫా మోదీ ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు రాజ్​నాథ్​. ఈ సారి అమిత్​ షాకు హోం మంత్రి పదవి దక్కింది.

దిల్లీ ఇండియా గేట్​ సమీపంలో నెలకొల్పిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details