కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు లోక్సభలో సమాధానం ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రభుత్వాలను కూల్చే పని గతంలో భాజపా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ఇప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
"కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలతో మాకెలాంటి సంబంధం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భాజపా కట్టుబడి ఉంది. రాజీనామాలను మేం ప్రోత్సహించలేదు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీనే రాజీనామా ప్రక్రియ మొదలుపెట్టారు. రాజీనామా చేయాలని ఆయనే వాళ్ల సభ్యులకు సూచించారు. ఆయన బాటను అనసరించే ఈ రాజీనామాల పర్వం కొనసాగుతోంది."