తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైన్యం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ పార్లమెంట్లో ఓ ప్రకటన చేయనున్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితిపై లోక్‌సభకు పలు విషయాలు వివరించే అవకాశం ఉంది.
లద్దాఖ్ ప్రతిష్టంభనపై లోక్‌సభలో నేడు రాజ్‌నాథ్ ప్రకటన - రాజ్‌నాథ్ సింగ్ చైనా ఉద్రిక్తతలు పార్లమెంట్లో ప్రకటన
లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేడు పార్లమెంట్లో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులతో పాటు, ఈ విషయంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లద్దాఖ్ ప్రతిష్టంభనపై లోక్‌సభలో నేడు రాజ్‌నాథ్ ప్రకటన
రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ ఇదివరకే చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగేతో సమావేశమయ్యారు. మరోవైపు మంత్రి జైశంకర్ సైతం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. అటు.. ఈ విషయంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ సమిటీలు ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.