తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జవాన్ల త్యాగాలను దేశం మరవదు' - భారత్​ చైనా ఘర్షణ

గాల్వన్​ లోయ వద్ద జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను కొనియాడారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​. వారి ధైర్య సాహసాలను భారత్​ ఎన్నటికీ మరువదని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

Rajnath calls killing of Indian soldiers in Galwan deeply disturbing and painful
'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

By

Published : Jun 17, 2020, 2:20 PM IST

లద్దాఖ్‌ గాల్వన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. విధి నిర్వహణలో వారు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని .. దేశం కోసం ప్రాణాలను వదిలి భారత సైన్యం విలువలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు.

రాజ్​నాథ్​ ట్విట్​

"సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మర్చిపోదు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి క్లిష్ట సమయంలో యావత్ భారత్​ వారికి మద్దతుగా నిలుస్తోంది."

-రాజ్‌నాథ్​సింగ్, రక్షణ మంత్రి

సోమవారం రాత్రి జరిగిన భారత- చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా సైన్యం కమాండింగ్ అధికారి సహా సుమారు 40 మంది సైనికులు చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:భారత్‌-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..

ABOUT THE AUTHOR

...view details