దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. వైరస్‌తో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి: రాజ్‌నాథ్ - భారత్‌లో కరోనా
దేశమంతటా ఆదివారం నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి: రాజ్‌నాథ్
కర్ఫ్యూ సమయంలో అధికారులకు సాయం చేయడానికి సాయుధ దళాలు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. కోవిడ్-19 బాధిత దేశాలైన చైనా, ఇరాన్, ఇటలీ, జపాన్ల నుంచి భారతీయులను తరలించడంలో నిర్బంధ శిబిరాల వద్ద సాయం అందించడంలో సాయుధ బలగాల కృషిని రాజ్‌నాథ్ ప్రశంసించారు.
ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు ఐదుగురు విదేశీయులతో సహా 1,059 మందిని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో క్వారంటైన్లో ఉంచారు.