తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీవ్​కు కాంగ్రెస్​ నేతల నివాళులు- మోదీ ట్వీట్ - నరేంద్ర మోదీ

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ వర్ధంతి సందర్భంగా వీర్​భూమిలోని ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు కాంగ్రెస్​ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ రాజీవ్​ గాంధీకి నివాళులు అంటూ  ట్వీట్​ చేశారు.

రాజీవ్​కు కాంగ్రెస్​ నేతల నివాళులు

By

Published : May 21, 2019, 10:41 AM IST

నేడు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్​ గాంధీ వర్ధంతి. ఆయన స్మారకమైన దిల్లీలోని వీర్​భూమిలో నివాళులు అర్పించారు యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. రాజీవ్​ సమాధికి పుష్పాంజలి ఘటించారు.

రాజీవ్​కు కాంగ్రెస్​ నేతల నివాళులు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ రాజీవ్​ గాంధీకి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

మోదీ ట్వీట్​

'మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీకి నివాళులర్పిస్తున్నా' అని ట్వీట్​ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో రాజీవ్​ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

ABOUT THE AUTHOR

...view details