తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీవ్ కేసు దోషుల విడుదలపై పిటిషన్​ తిరస్కరణ

రాజీవ్​ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ ధర్మాసనం గత తీర్పులోనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. విచారణ అవసరం లేదని వ్యాఖ్యానించింది.

By

Published : May 9, 2019, 12:51 PM IST

Updated : May 9, 2019, 2:48 PM IST

రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై పిటిషన్​ తిరస్కరణ

రాజీవ్ కేసు దోషుల విడుదలపై పిటిషన్​ తిరస్కరణ

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్​ గాంధీ హత్య కేసు దోషుల విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీం కోర్టు.
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహుతి దాడిలో మాజీ ప్రధానితో పాటు మరణించిన వారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దోషుల విడుదల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది. రాజ్యాంగ ధర్మాసనం గత తీర్పులోనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి విచారణ అవసరం లేదని తేల్చింది.

2014లో జయలలిత నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం రాజీవ్​ హత్య కేసులోని ఏడుగురు దోషులను విడుదల చేయాలని నిర్ణయించింది.

1991, మే 21 తమిళనాడులోని శ్రీ పెరుంబదుర్​లో జరిగిన ఆత్మహుతి దాడిలో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్​ గాంధీ మరణించారు.

ఇదీ చూడండి: 'ప్రియాంకను చూస్తే ఇందిర గుర్తొచ్చారు'

Last Updated : May 9, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details