తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదుపు చేయలేకపోతే తప్పుకోవాలి: రజనీ - దిల్లీ ఘర్షణలపై తీవ్ర ఖండన

దిల్లీ ఘర్షణలను తీవ్రంగా ఖండించారు సూపర్​స్టార్ రజనీకాంత్. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఈ ఘర్షణలు తప్పకుండా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు.

rajani
దిల్లీ ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నా: రజనీ

By

Published : Feb 26, 2020, 11:42 PM IST

Updated : Mar 2, 2020, 4:57 PM IST

దేశ రాజధాని దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో జరిగిన హింసాత్మక ఘటనపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని పేర్కొన్నారు. కచ్చితంగా ఇది ఇంటెలిజెన్స్‌ వైఫల్యమేనని ఆరోపించారు. ఇంటిలిజెన్స్‌ వైఫల్యమంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వైఫల్యమని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ఆందోళనలను అదుపు చేయాలని, చేయలేకుంటే తప్పుకోవాలని సూచించారు. ఈ విధమైన అంశాల్లో ఇకనైనా ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టి సారించాలన్నారు. కేంద్రం సీఏఏని ఉపసంహరించుకుంటుందని తాను అనుకోవడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, సీఏఏ వల్ల ఏ వర్గానికైనా నష్టం జరిగితే ప్రశ్నించే వారిలో తాను ముందుంటానని పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి:'పౌర' సెగ: 106 మంది అరెస్టు-18 ఎఫ్​ఐఆర్​లు నమోదు

Last Updated : Mar 2, 2020, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details