'అన్నా మీరు తప్పకుండా రాజకీయాల్లో రావాలి' ఒకానొక దశలో రజనీకాంత్ నటించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత్రతో దర్శకులు ఈ డైలాగ్ చెప్పించేవారు. దానికి రజనీ సమాధానంగా పైకి చేయి ఎత్తి చూపడమో.. లేదా వెండితెర ముందున్న ప్రేక్షకులను చూపిస్తూ.. 'వాళ్లు కోరుకుంటే వస్తా'నంటూ చెప్పడమే జరిగేది. ఇంతకాలానికి ఆ సమయం రానే వచ్చింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించిన తలైవా గత కొన్ని రోజులుగా చకచకా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తన అభిమానులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన కొత్త పార్టీల జాబితాలో 'మక్కల్ సేవై కట్చి' వద్ద రజనీకాంత్‌పేరు ఉండటంతో ఒక్కసారిగా సంచలనమైంది. అంతేకాదు, 'ఆటో'ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ఏయే సినిమాల ప్రభావం ఉందో ఓ సారి చూద్దాం.
'బాషా'తో మారిన రజనీ
90వ దశకం మధ్య నుంచి రజనీ నటించిన సినిమాల్లో మనకు పెను మార్పులు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలు సంభాషణలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓ మాస్ నాయకుడి పాత్రలను ఆయన ఎంచుకున్నారు. మరీ ముఖ్యంగా 'బాషా'తో రజనీ స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తమిళంతో పాటు, తెలుగులోనూ రజనీకి అభిమానులు పెరిగారు. ఆ సినిమా రజనీ ఇమేజ్ శిఖరస్థాయికి తీసుకెళ్లింది. మాణిక్యం/మాణిక్ బాషాగా వైవిధ్యమైన పాత్రల్లో రజనీ మెప్పించారు. ఈ సినిమాలో ఆయన 'నాన్ ఆటోకారన్..' అంటూ తమిళ తెరపై, 'నేను ఆటో వాడ్ని' అంటూ తెలుగులో ఆడి పాడి అలరించిన తీరు మాస్‌లో మరింత చొచ్చుకుపోయింది. 'నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అన్న డైలాగ్ విపరీతంగా పాపులర్ అయింది.
ఆ తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ముత్తు' చిత్రం ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసింది. అందులో ఇచ్చిన మాట కోసం ఆస్తిని రాసిచ్చే జమీందారు పాత్రతో పాటు, ముత్తుగా ఆయన మాస్‌కు మరింత దగ్గరయ్యారు. రజనీలో రాజకీయనాయకుడి కోణాన్ని చూపించిన చిత్రం ‘అరుణాచలం'. తండ్రి ఆస్తి దుర్మార్గుల చేతిలో పడకుండా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టిన తీరు భలేగా అనిపిస్తుంది. అందులో రాజకీయ పార్టీని స్థాపించి 'రుద్రాక్ష' గుర్తుతో ఎన్నికల బరిలో తన స్నేహితుడిని నిలబెడతారు రజనీ. 'సింగన్న బయలుదేరెను' అంటూ పాటలో ఇప్పటికీ అలరిస్తుంది. ఈ సినిమాతో రజనీకి క్రేజ్ మరింత పెరిగింది. దీని తర్వాత వచ్చిన 'నరసింహ' రజనీని మరో మెట్టుపై నిలబెట్టింది. దీంతో ఆ సమయంలో రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
'బాబా' హిట్ అయి ఉంటే..?