రజనీకాంత్ కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్ సలహాదారు. వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో బరిలోకి దిగనున్నట్టు సలహాదారు తమిళరువి మణియన్ తెలిపారు. రజనీకాంత్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారాయన.
'తమిళనాట అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీ' - రజనీకాంత్ సలహాదారు
తమిళనాడులో రజనీకాంత్ కొత్తగా ఏర్పాటుచేయనున్న పార్టీ.. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తలైవా సలహాదారు ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయం నెలకొల్పడమే తమ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.
తమిళనాట అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీ
ప్రస్తుతం కొనసాగుతున్న విద్వేష రాజకీయాలు కాకుండా ఆధ్యాత్మిక రాజకీయాలు చేయనున్నట్లు మణియన్ అన్నారు. లౌకిక, ఆధ్యాత్మిక రాజకీయాలు కలిసి పనిచేయటం అసాధ్యమన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఇదీ చదవండి:రజనీతో పొత్తుకు సిద్ధం: పన్నీర్ సెల్వం
Last Updated : Dec 5, 2020, 4:23 PM IST