తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీవ్​కుమార్ ముందస్తు బెయిల్​కు కోర్టు నిరాకరణ - kolkata

శారదా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​కుమార్ ముందస్తు బెయిల్​ వినతిని తిరస్కరించింది అలీపుర కోర్టు. శారదా కేసులో రాజీవ్​ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

రాజీవ్​కుమార్ ముందస్తు బెయిల్​కు కోర్టు నిరాకరణ

By

Published : Sep 22, 2019, 5:24 AM IST

Updated : Oct 1, 2019, 1:01 PM IST

కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​కుమార్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తన కోసం సీబీఐ గాలిస్తున్న తరుణంలో అలీపుర కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ వినతిని తిరస్కరించింది న్యాయస్థానం. శుక్రవారం కోర్టులో బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేశారు రాజీవ్​కుమార్. శారదా కేసులో రాజీవ్​ను అరెస్టు చేసేందుకు వారెంట్ అవసరం లేదన్న కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ ఛార్జిషీటులో తన పేరు లేదని పేర్కొంటూ రాజీవ్ దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను విచారించారు జడ్జి. బెయిల్ వినతిని తోసిపుచ్చారు.
2013లో శారదా కుంభకోణాన్ని విచారించిన బృందానికి రాజీవ్​ సారధ్యం వహించారని పేర్కొన్నారు బెయిల్​ పిటిషన్​ను వ్యతిరేకించిన సీబీఐ అధికారి కేసీ మిశ్రా.

"మేం బెయిల్ పిటిషన్​ను వ్యతిరేకించేందుకు బలమైన కారణాలున్నాయి. సుప్రీంకోర్టు అభిప్రాయానికి అనుగుణంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నాం."

-కోర్టులో సీబీఐ వాదన

సీబీఐ ద్వారా వచ్చిన సమన్లను తిరస్కరించడం ద్వారా చట్టన్ని అగౌరవపరుస్తున్నారని వ్యాఖ్యానించారు మిశ్రా.

ఇదీ చూడండి: ఇంట్లో బాణాసంచా పేలుడు- ఆరుగురు మృతి

Last Updated : Oct 1, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details