కేరళలో మే 27న జరిగిన గర్భిణీ ఏనుగు హత్య చాలా మందిని కలచివేసింది. మూగజీవంపై ఇంత అమానుషంగా ప్రవర్తించటం మానవత్వానికే మచ్చతెచ్చింది. అయితే దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడుతున్నాడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. ఐదేళ్ల పాటు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేసిన పీరారామ్ ధాయల్.. తన మిగిలిన జీవితాన్ని వన్యప్రాణులకు అంకితం చేశాడు.
జాలోర్ జిల్లా దేవరా గ్రామానికి చెందిన ధాయల్.. 1990లో ఉద్యోగాన్ని వదిలేశాడు. అనంతరం మూగజీవాల సంరక్షణ కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాడు. గాయపడిన మూగజీవులను రక్షించి, చికిత్స అందించేవాడు. అవి కోలుకున్న తర్వాత అడవిలో వదిలిపెడతాడు. ఇలా కొన్నేళ్లుగా 900 మూగజీవాలకు పైగా రక్షించాడు పీరారామ్. 2003 నుంచి ఈ పనిని చేస్తున్నాడు.
గార్డెన్ పెంపకం..
ధాయల్ 2009లో గ్రామస్థుల సాయంతో జిల్లాలోని హైవేను ఆనుకుని ఉన్న ధామ్నాలో 6,000 మొక్కలు నాటాడు. దీనికి 'అమృత దేవి గార్డెన్'గా నామకరణం చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే జింకలు, కుందేళ్లు, దుప్పి, కోతులు, నెమళ్లకు చికిత్స అందిస్తున్నాడు. ప్రస్తుతం సుమారు 50 జింకలు గార్డెన్లో ఉన్నట్లు ధాయల్ చెబుతున్నాడు.
ఫిర్యాదులతో ఆటంకం..