తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దంగల్​ 2.0 తీసేందుకు మరో యదార్థ కథ సిద్ధం!

ఆడపిల్లలు తుమ్మినా తప్పులెంచే సమాజం ఎంత వెక్కిరించినా భయపడలేదు ఆ తండ్రి. బరితెగించారంటూ గ్రామస్థులు రాళ్లతో కొట్టి తరిమినా సాధన మాన్పించలేదు. తన పొలాన్నే మైదానంగా మార్చి నలుగురు కుమార్తెలకు శిక్షణ ఇచ్చాడు. జాతీయ స్థాయి రెజ్లర్స్​గా తీర్చిదిద్దాడు. మరికొంత సహకారం అందితే  తన బిడ్డలు ఆడపులులుగా పోరాడి దేశ ఖ్యాతిని మరింత పెంచుతారని ధీమాగా చెబుతున్నాడు.

దంగల్​ 2.0 తీసేందుకు మరో యదార్థ కథ సిద్ధం!

By

Published : Oct 28, 2019, 6:31 AM IST


దంగల్​... రెజ్లర్లు గీత, బబితా ఫొగట్​ల బయోపిక్.​ ఓ పల్లెటూరి పేద తండ్రి తన కూతుళ్లకు మట్టిలో కుస్తీ నేర్పించి.. అంతర్జాతీయ క్రీడాకారిణులుగా తీర్చిదిద్దిన యదార్థ కథకు దృశ్యరూపం. అచ్చంగా అలాంటి తండ్రి కథే.. రాజస్థాన్​ భరత్​పుర్​లో వెలుగు చూసింది. పేదరికాన్ని ఎదిరించి నలుగురు కుమార్తెలకు తన పొలంలోనే రెజ్లింగ్ నేర్పించాడు. జాతీయస్థాయి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దాడు.

దంగల్​ 2.0 తీసేందుకు మరో యదార్థ కథ సిద్ధం!

కూతుళ్లే.. అయితే?

రాజస్థాన్​ జైపుర్​కు 180 కి.మీ దూరంలో ఉన్న భరత్​పుర్​ కుస్తీ​ క్రీడకు పెట్టింది పేరు. అయితే.. ఆడపిల్లలు రెజ్లింగ్ చేస్తే మాత్రం ఒప్పుకునే విశాల హృదయులు చాలా తక్కువ. కానీ, కుమార్తెలైతే ఏంటి... వారినీ కుమారుల్లా పెంచాలనుకున్నాడు ఊంఛాగావ్​ వాసి కేసరి.

కేసరి... ఓ రైతు. అయినా... నలుగురు కూతుళ్లను ఎప్పటికైనా మంచి క్రీడాకారిణులుగా తయారు చేయాలని కలలు కన్నాడు. అనుకున్నట్టే తన మొదటి ఇద్దరు కుమార్తెలు రాఖీ, వసుధలను పాఠశాల పీఈటీ నిరంజన్​ సింగ్ సహకారంతో రాష్ట్రస్థాయి క్రీడాకారిణులుగా తయారు చేశాడు.

"నా కుమార్తెలు రాఖీ, వసుధకు బాల్యం నుంచే రెజ్లింగ్ నేర్పించేవాడిని. మట్టిలో వారు పోరాడే శక్తిని పరీక్షించేవాడిని. వారికి శిక్షణ ఇచ్చేందుకు నేను వ్యవసాయాన్ని వదిలేశాను. నా పొలాన్నే రెజ్లింగ్​ మైదానం చేశాను. కానీ, నా పేదరికం కారణంగా వారికి నేను సరైన శిక్షణ ఇప్పించలేకపోతున్నా. వారికి సరైన ఆహారం ఇవ్వడానికి డబ్బు కావాలి."
- కేసరి

రాఖీ, వసుధకు దేశం కోసం పతకాలు​ సాధించాలన్న తపన పెరిగింది. అంతర్జాతీయ రెజ్లర్స్​ గీత, బబితా ఫొగట్​ల స్ఫూర్తితో రెజ్లింగ్​లో దూసుకుపోయారు. రాఖీ రాజస్థాన్​ కేసరి-2014 టైటిల్​ సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ టీచర్​గానూ ఎంపికైంది.

రాఖీ, వసుధ... కబడ్డీ, క్రాస్​ కంట్రీ రన్​ వంటి క్రీడల్లోనూ సత్తా చాటారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు​ సాధించారు.
ఎన్ని పోటీల్లో గెలిచినా... సమాజం నుంచి వింత అనుభవాలను ఎదుర్కొనక తప్పలేదు. ఓ సారైతే గ్రామస్థులు తండ్రి కూతుళ్లను వెంబడించి మరీ రాళ్లు రువ్వారు. అయినా వెనకడుగు వేయలేదు. మరింత కఠోర సాధన చేశారు. వారెంటో నిరూపించుకున్నారు.

కేసరి చిన్న కుమార్తెలు మాధవి, తులసి కూడా రెజ్లింగ్​ రింగ్​లోకి దిగారు. అక్కలను మించిపోయి ఆటలో సత్తా చాటారు. కానీ, సరైన సదుపాయాలు లేక పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోతున్నారు. సరైన సౌకర్యాలు కల్పిస్తే తాము కూడా దేశ కీర్తిని ప్రపంచానికి చాటుతామంటున్నారు కేసరీ డాటర్స్​.

ఇదీ చూడండి:ఆ స్వీట్ ఖరీదు కిలో రూ.11,000- ప్రత్యేకత ఇదే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details