అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవసరమయ్యే రాతి తవ్వకానికి రాజస్థాన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భరత్‌పుర్ జిల్లాలోని బంద్ బరేతా అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
చాలా ఏళ్లుగా రామ మందిరాల నిర్మాణం కోసం.. భరత్‌పుర్‌లోని బన్సి పహార్పుర్ గులాబీ ఇసుకరాయిని వాడుతున్నారు. టన్నుల కొద్ది రాయి ఇక్కడి నుంచి తరలిపోయింది. అయితే.. ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపితే అరుదైన గులాబీ ఇసుకురాయి హరించుకుపోతుందని ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో అన్ని విధాలా అలోచించి.. బంద్ బరేతా అభయారణ్యంలో తవ్వకాలకు సుముఖం వ్యక్తం చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. కానీ, అనుమతుల్లో ఆలస్యం ఏర్పడింది. అయితే.. టెక్నికల్ సమస్య వల్లే ఈ జాప్యం జరిగిందని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఓ నేత తెలిపారు. ప్రస్తుతం ఈ సమస్య తీరిపోయిందని చెప్పారు.