రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతరం తమ శాసనసభ్యులను మభ్యపెట్టి చట్టవిరుద్ధంగా కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారని ఆరోపించింది బీఎస్పీ అధినేత్రి మాయవతి. దీనిని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి.
"ఎన్నికల అనంతరం బీఎస్పీ బేషరతుగా కాంగ్రెస్కు మద్దతు పలికింది. అయితే దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ రాజ్యాంగ విరుద్ధంగా మా శాసనసభ్యులను కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు. ఇంతకుముందు ఆయన పదవీకాలంలో కూడా ఇలాగే చేశారు. బీఎస్పీ ఇంతకంటే ముందే కోర్టుకు వెళ్లేది. అయితే సరైన సమయం కోసం వేచిచూశాం. ప్రస్తుతం మా సభ్యుల విలీనాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాం. దీనిపై సుప్రీం కోర్టు వరకు పోరాడతాం."
-మాయవతి, బీఎస్పీ అధినేత్రి
రాజస్థాన్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిగితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయమని తమ శాసనసభ్యులను కోరినట్లు వెల్లడించారు మాయవతి.