తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజ'కీయం.. గహ్లోత్ రాజీనామాకు భాజపా నేతల డిమాండ్ - 'రాజ'కీయం.. గవర్నర్​తో మరికాసేపట్లో సీఎం భేటీ

rajasthan
'రాజ'కీయం.. గవర్నర్​తో మరికాసేపట్లో సీఎం భేటీ

By

Published : Jul 25, 2020, 4:02 PM IST

Updated : Jul 25, 2020, 7:17 PM IST

19:17 July 25

స్పీకర్ పిటిషన్​పై జులై 27న విచారణ

అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశమై హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై జులై 27న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై శుక్రవారం వరకు అనర్హత వేటు వేయకుండా స్టే విధిస్తూ హైకోర్టు ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు స్పీకర్ జోషి.  

18:28 July 25

రాజ్​భవన్ ముట్టడి వ్యాఖ్యలపై భాజపా సీరియస్

అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేయకుంటే రాజ్​భవన్​ను ప్రజలు ముట్టడిస్తారని శుక్రవారం సీఎం గహ్లోత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు రాజస్థాన్ భాజపా నేతలు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అలాంటి పదజాలం ఉపయోగించినందుకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్​ను కలిసిన అనంతరం ఈ మేరకు ప్రకటించారు భాజపా నేతలు.

17:33 July 25

గవర్నర్​ను కలిసిన భాజపా నేతలు

రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు సతీశ్ పూనియా, శాసనసభ విపక్షనేత గులాబ్ చంద్ కఠారియా నేతృత్వంలో 13మంది బృందం గవర్నర్​ కల్​రాజ్ మిశ్రాతో భేటీ అయింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్​కు విజ్ఞాపన పత్రాన్ని అందించింది.  

16:30 July 25

రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు సతీశ్ పూనియా, శాసనసభ విపక్ష నేత గులాబ్​ చంద్ కఠారియా సహా  13మంది బృందం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ కల్​రాజ్ మిశ్రాను కలవనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై గవర్నర్​కు నేతలు విజ్ఞప్తి చేయనున్నారు.    

15:48 July 25

'రాజ'కీయం.. గవర్నర్​తో మరికాసేపట్లో సీఎం భేటీ

రాజస్థాన్​లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సొంతపార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన అధికార కాంగ్రెస్..​ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు శతవిధాల కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సాయంత్రం 4 గంటలకు గవర్నర్ కల్​రాజ్ మిశ్రాతో భేటీ కానున్నారు.

ఇప్పటికే జైపుర్​ ఫెయిర్​మౌంట్ హోటల్​లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్​కు వెళ్లి రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం ఇస్తామని, ప్రధాని అధికారిక నివాసం ముందు ధర్నా చేపడతామని ఈ సమావేశం వేదికగా ప్రకటించారు సీఎం గహ్లోత్.  

గవర్నర్​ను కలవనున్న భాజపా నేతలు..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, విపక్ష నేత గులాబ్ చంద్ర మిశ్రా నేతృత్వంలో శనివారం సాయంత్రం గవర్నర్ కల్​రాజ్ మిశ్రాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించనున్నారు.

Last Updated : Jul 25, 2020, 7:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details