గణేశ్ నిమజ్జన వేడుకల్లో కత్తి తిప్పి కష్టాలు తెచ్చుకున్నారు ఓ పోలీసు అధికారి. రాజస్థాన్ చిత్తోఢ్గఢ్లో గణపతి నిమజ్జనంలో పాల్గొన్న పోలీస్ అధికారి హిమాన్షు సింగ్.. తల్వార్తో అద్భుత విన్యాసాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదంతా బాగానే ఉన్నా యూనిఫాంలో ఉండి ఇలాంటి పనులు చేసినందుకు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ దుస్తులకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని హిమాన్షును ఆదేశించారు అధికారులు.