తెలంగాణ

telangana

ETV Bharat / bharat

17వ లోక్​సభ స్పీకర్ ఓం బిర్లానే..! - loksabha

లోక్​సభ స్పీకర్​గా రాజస్థాన్​ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే కానుంది. ఆయన అభ్యర్థిత్వానికి ఎన్డీఏతో సహా యూపీఏ పక్షాలు, వైకాపా, బీజేడీ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రతిపక్షాల నుంచి నామినేషన్​ దాఖలు కానందున బిర్లా ఎన్నిక నేడు ఏకగ్రీవం కానుంది.

ఓం బిర్లా

By

Published : Jun 19, 2019, 5:37 AM IST

Updated : Jun 19, 2019, 9:38 AM IST

పదిహేడవ లోక్​సభ స్పీకర్​ ఎంపికలో భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సభాపతి అభ్యర్థిగా రాజస్థాన్​ కోటా ఎంపీ ఓం బిర్లాను ప్రతిపాదించింది. ఆయన స్పీకర్​ పదవికి నామినేషన్​ దాఖలు చేశారు. ఈ రోజు లోక్​సభలో స్పీకర్​ ఎంపికపై తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. ప్రతిపక్షాల నుంచి నామినేషన్​ దాఖలు కానందున సభాపతిగా బిర్లా ఎన్నిక లాంఛనమే కానుంది.

స్పీకర్​గా బిర్లాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రాజస్థాన్​ నేత మోదీతో పాటు భాజపా అధ్యక్షుడు అమిత్​ షాకు అత్యంత సన్నిహితుడు. మిత ప్రచారం, క్షేత్రస్థాయిలో పని చేసే నేతలకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికే బిర్లాను ఎంపిక చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్ని పార్టీల మద్దతు

బిర్లా అభ్యర్థిత్వంపై అన్ని పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. ఎన్డీఏ, వైకాపా, బీజేడీ, కాంగ్రెస్ సహా కీలక ప్రతిపక్షాలన్నీ ఇందుకు అంగీకరించాయి.

సభాపతిగా ఓం బిర్లాకు మద్దతు తెలపాలని యూపీఏలోని అన్ని పార్టీలు తీర్మానించాయని కాంగ్రెస్ లోక్​సభా పక్ష నేత అధిర్ రంజన్​ చౌదరి స్పష్టం చేశారు.

"అధికార పార్టీ ప్రతిపాదించిన స్పీకర్​ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఇప్పటికే తీర్మానం చేశాం. ఈ విషయాన్ని పార్లమెంటులో జరిగిన యూపీఏ పక్షాల సమావేశంలో నిర్ణయించాం. అయితే ఉప సభాపతి ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు."

-అధిర్​ రంజన్ చౌదరి, కాంగ్రెస్ లోక్​సభా పక్ష నేత

ఉప సభాపతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపే వరకు వేచి చూడాలని కాంగ్రెస్​తో పాటు యూపీఏ పక్షాలు భావిస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీ నేతకు ఉప సభాపతి పదవి కేటాయిస్తారు.

ఇదీ చూడండి: స్పీకర్ ఓం బిర్లానే..! 10 పార్టీల మద్దతు

Last Updated : Jun 19, 2019, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details