పిడవా... రాజస్థాన్‌లోని ఝలావాడ్‌లో ఓ పట్టణం. ఒకప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా హాట్‌స్పాట్‌గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా దానిని జయించింది. అప్రమత్తత, అవగాహనలతో ఆ వైరస్ కోరల నుంచి బయటపడింది.
పకడ్బందీగా జాగ్రత్త చర్యలు
ఏప్రిల్ 7న ఝలావాడ్‌లో తొలికేసు నమోదైంది. అదీ పిడవా పట్టణానికి చెందిన వ్యక్తికే. అదేరోజు మరో ఇద్దరు బాధితులనూ అధికారులు గుర్తించారు. వారు ఇండోర్, కోటా, బరన్ జిల్లాల వారితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిశాక పిడవా పురపాలక సంఘం మొత్తంపై అదేరోజు నుంచి కరోనాను జయించిన పిడవా పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. 40 మంది నుంచి నమూనాలు తీసి పరీక్షలకు పంపిస్తే ఏడుగురికి పాజిటివ్ అని వచ్చింది. వీరు ఎవరెవరిని కలిశారో తెలుసుకుని మరో 40 మందికి పరీక్షలు నిర్వహింపజేస్తే వారిలోనూ ముగ్గురు పాజిటివ్‌గా తేలారు. మూడు రోజుల్లోనే కేసులు 13కి చేరిపోయాయి. ఏప్రిల్ 17 నాటికి కేసుల సంఖ్య 20కి పెరిగింది. ఆ రోజు తర్వాత ఒక్కకేసూ రాలేదు. అంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మొట్టమొదటి బాధితుడు సహా అందరూ కోలుకుని ఇళ్లకు చేరుకోగలిగారు.