రాజస్థాన్లో రాజకీయ ప్రతిష్టంభన సమసిపోయిన నెలల తర్వాత అక్కడి రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని గహ్లోత్ సర్కార్ కూలిపోకుండా ఉండేందుకు కారణం వసుంధర రాజె అని వ్యాఖ్యానించింది.
'వసుంధర మద్దతు వల్లే గహ్లోత్ ప్రభుత్వం కూలలేదు' - రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ
రాజస్థాన్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోకుండా ఉండటానికి వసుంధరా రాజే(భాజపా) 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చారని రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ ఆరోపించింది. రాజస్థాన్లో గహ్లోత్, వసుంధర పొత్తులు ఏర్పరచుకున్నారని చెప్పుకొచ్చింది.
'వసుంధర మద్దతు వల్లే గహ్లోత్ ప్రభుత్వం కూలలేదు'
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె పొత్తు కుదుర్చుకున్నారని ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి సచిన్ పైలట్ బయటకు వచ్చిన సమయంలో తన(ఆర్ఎల్పీ) పార్టీ ఆయన(సచిన్) వెంటే ఉందని తెలిపారు.
అయితే వసుంధరా రాజే మాత్రం ముఖ్యమంత్రి గహ్లోత్కు 20 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారని అన్నారు బెనివాల్. అందువల్లే ప్రభుత్వం కూలిపోలేదని తెలిపారు.