రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించాలని ప్రయత్నిస్తోంది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బలం నిరూపించుకోవాలని చూస్తోంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఆయన మంత్రి వర్గం.. మరోమారు ఈ రోజు భేటీ కానుంది. సమావేశాలు త్వరితగతిన నిర్వహించాలని మళ్లీ ప్రతిపాదించనున్నారు .
శుక్రవారం రాత్రి భేటీ అయిన గహ్లోత్ మంత్రివర్గం.. సుమారు రెండు గంటల పాటు గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలపై చర్చించింది. శనివారం మరోమారు మంత్రివర్గం భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ భేటీలో ఆమోదం తర్వాత కొత్త ప్రతిపాదనలను గవర్నర్కు పంపనున్నట్లు స్పష్టం చేశారు.