కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రభుత్వం చట్టాలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. పంజాబ్ దారిలోనే కేంద్రం చట్టాలను అడ్డుకొనే విధంగా బిల్లును తీసుకురానుంది. అక్టోబర్ 31న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పేద రైతుల హక్కులను రక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు
"రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బిల్లును అక్టోబర్ 31న ప్రవేశపెట్టనుంది. రైతులతో పాటు వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి అభినందనలు."
-కేసీ వేణుగోపాల్ ట్వీట్