రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మాస్క్ ధరించటాన్ని తప్పనిసరి చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
రాజస్థాన్ అంటువ్యాధుల (సవరణ) బిల్-2020ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్. ఈ బిల్లులోని సెక్షన్-4లో కొత్త క్లాజ్‌ను చేర్చారు. జనసంచార ప్రాంతాల్లో నోరు, ముక్కును మూసి ఉంచేలా మాస్క్ లేదా కవర్ లేకుండా తిరగటాన్ని నేరంగా భావించాలని ఈ క్లాజ్ సూచిస్తోంది.