అసెంబ్లీ సమావేశాలకు రాజస్థాన్ గవర్నర్ అనుమతి - Rajasthan political updates
15:32 July 27
అసెంబ్లీ సమావేశాలకు రాజస్థాన్ గవర్నర్ అనుమతి
రాజస్థాన్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు అనుమతిచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి 21 రోజులు ముందుగా గహ్లోత్ సర్కార్ నోటీసు ఇవ్వాలని రాజ్‌భవన్ సూచించింది.
సచిన్ పైలట్ రెబల్‌గా మారడం రాజస్థాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవులను నుంచి తప్పించింది కాంగ్రెస్. ఈ పరిణామాలతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే తమ వద్ద మెజారిటీ ఉందని.. తమ బలాన్ని నిరూపించుకునేందుకు శాసనసభ నిర్వహించాలని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం గవర్నర్‌ను కోరుతోంది.