పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వం, జీవించే హక్కులను ఉల్లంఘించే విధంగా సీఏఏ ఉందని పిటిషన్లో పేర్కొంది.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని పిటిషన్లో తెలిపింది అశోక్ గహ్లోత్ సర్కారు. సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదించి సుప్రీం కోర్టును ఆశ్రయించిన రెండో రాష్ట్రం రాజస్థాన్. అంతకుముందు కేరళ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.