రాజస్థాన్ రాజకీయాలు క్షణక్షణానికి మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఓవైపు రెబల్ నేత సచిన్ పైలట్‌ను బుజ్జగిస్తూనే.. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు అనుకూలంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఈ మేరకు సోమవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ)సమావేశంలో.. గహ్లోత్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు నేతలు.
"కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలపై సీఎల్పీ పూర్తి విశ్వాసంతో ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సీఎల్పీ ఏకగ్రీవంగా మద్దతిస్తోంది."
-- సీఎల్పీ తీర్మానం
ఇదీ చూడండి:-సచిన్ 'పవర్ ప్లే': రంగంలోకి రాహుల్, ప్రియాంక!
పార్టీని బలహీనపరిచే విధంగా ప్రవర్తించే ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సీఎల్పీ సూచించింది.