తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్​ ప్రశ్నలపై రాజస్థాన్​ కేబినెట్​ సుదీర్ఘ చర్చ

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​.. శుక్రవారం రాత్రి తన నివాసంలో కేబినెట్​ భేటీ నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో.. శాసనసభ నిర్వహణ నేపథ్యంలో గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా అడిగిన ప్రశ్నలపై మంత్రులు చర్చించినట్టు సమాచారం.

Rajasthan cabinet discusses guv's six points on assembly session
గవర్నర్​ ప్రశ్నలపై రాజస్థాన్​ కేబినెట్​ సుదీర్ఘ చర్చ

By

Published : Jul 25, 2020, 5:30 AM IST

రాజస్థాన్​ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా.. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ నివాసంలో అర్థరాత్రి వరకు కేబినెట్​ సమావేశం జరిగింది. శాసనసభ నిర్వహణపై గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా అడిగిన ఆరు ప్రశ్నలపై ఈ భేటీలో మంత్రులు సుదీర్ఘంగా చర్చినట్టు సమాచారం.

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో బలనిరూపణ కోసం శాసనసభ సమావేశాలకు పిలుపునివ్వాలని శుక్రవారం గవర్నర్​ను కోరారు గహ్లోత్​. ఈ విషయంలో రాజ్యంగబద్ధంగానే ముందుకు వెళతానని స్పష్టం చేశారు మిశ్రా. అయితే అసలు సమావేశాలను ఎందుకు నిర్వహించాలి? అనే విషయంపై పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్​. దీనిపై రెండున్నర గంటలపాటు చర్చించిన మంత్రులు.. తమ సమాధానాన్ని శనివారం గవర్నర్​కు అందించనున్నట్టు సమాచారం.

గతకొంత కాలంగా కాంగ్రెస్​పై అసంతృప్తిగా ఉన్న సచిన్​ పైలట్​ పార్టీపై తిరుగుబావుటా ఎగరవేశారు. అనంతరం పైలట్​పై వేటు వేసింది కాంగ్రెస్​. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. అయితే తమ వద్ద మెజారిటీకి సరిపడా బలం ఉందని గహ్లోత్​ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details