తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసుల బరువు, చుట్టుకొలతల లెక్క తేల్చే పనిలో ఎస్పీ - rajasthan bikaner sp oీ్ాీే

భారీకాయాల పోలీసులపై దృష్టి పెట్టారు రాజస్థాన్​ బికనేర్ జిల్లా ఎస్పీ. సిబ్బంది నడుం చుట్టు కొలత, బరువు వివరాలు సమర్పించాలని అన్ని పోలీస్​ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. సరైన వివరాలు పంపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీసుల బరువు, చుట్టుకొలతలు అడిగిన ఎస్పీ!

By

Published : Oct 24, 2019, 1:30 PM IST


అధిక బరువున్న పోలీసులు ఖంగుతినేలా ఓ ఆదేశమిచ్చారు రాజస్థాన్​ బికనేర్​ జిల్లా సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​. జిల్లావ్యాప్తంగా పోలీసు సిబ్బంది బరువు, నడుం చుట్టు కొలతల వివరాలు పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ ప్రదీప్​ మోహన్​ శర్మ.

పోలీసు ఉద్యోగ ప్రవేశ పరీక్ష ఎంత బాగా రాసినా.. శారీరక దారుఢ్య పరీక్షలో విఫలమైతే వారు ఆ శాఖకు అనర్హులుగా పరిగణిస్తారు. నేరస్థులను పట్టుకోవాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా శారీరక దారుఢ్యం ఎంతో కీలకం. కానీ, కొందరు ఉద్యోగం రాగానే తమ శరీరాకృతిని పట్టించుకోవడం మానేస్తారు. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శర్మ.

గుర్తించి.. పంపండి

"మీ కార్యలయంలో నియమితులైనవారిలో అధిక బరువుతో ఉన్న, ఉదరభాగం సాధారణం కంటే ఎక్కువగా ఉన్న పోలీసు అధికారులను గుర్తించండి. వారి నడుం చుట్టు కొలత, శరీర బరువు వివారాలు సేకరించి నవంబర్​ 1వ తేదీలోపు ఈ కార్యాలయానికి పంపించండి. ఈ ఆదేశాన్ని విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది."
-ఎస్పీ ఉత్తర్వుల సారాంశం

ఊబకాయం విధి నిర్వహణకు ఆటంకంగా మారుతున్నందున్న ఫిజికల్​ ఫిట్​నెస్​పై దృష్టి సారించాలని ఎస్పీ అన్నారు. వివారాలను ఈ-మెయిల్​ ద్వారా పంపించాలని జిల్లాలోని అన్ని పోలీస్​ స్టేషన్​లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:600ఎకరాల చెరువులో ఒకేసారి కలువలు విరబూస్తే...

ABOUT THE AUTHOR

...view details