అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీ నెగ్గిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సచిన్ పైలట్. మంచి మెజారిటీతో ప్రభుత్వం విశ్వాస పరీక్షను నెగ్గింది. 'ప్రతిపక్షాలు వివిధ ప్రయత్నాలు చేపట్టినా.. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం వచ్చింది' అని పేర్కొన్నారు.
విశ్వాస పరీక్ష సందర్భంగా గహ్లోత్ కీలక వ్యాఖ్యలు - రాజస్థాన్‌లో బలపరీక్ష
16:35 August 14
'ప్రతిపక్షాలు కుట్రలు పన్నినా.. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం'
16:25 August 14
'సీబీఐ, ఈడీ వంటి సంస్థల దుర్వినియోగం'
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. 'దేశంలో ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను విబాగాలు దుర్వినియోగం కావట్లేదా? ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు, అవతలి వ్యక్తిని ఫేస్‌టైమ్, వాట్సాప్‌లో మీతో చేరాలని చెప్పకండి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి విషయమా?' అని పేర్కొన్నారు.
16:12 August 14
- విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్ సర్కార్
- మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో విజయం
- ఈనెల 21కి వాయిదా పడిన శాసనసభ
15:34 August 14
'యుద్ధవీరుడినే సరిహద్దుకు పంపుతారు'
అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్.
'గతంలో కూర్చున్న సీటులో సురక్షితంగా ఉన్నా. నాకు వేరే సీటును ఎందుకు కేటాయించారో అని అనుకున్నా. ఈ సీటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు సరిహద్దుగా ఉంది. సరిహద్దుకు ఎవరిని పంపుతారు? బలమైన యుద్ధవీరుడినే కదా'
- సచిన్ పైలట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
13:18 August 14
విశ్వాస పరీక్షకు ప్రతిపాదన
రాజస్థాన్ శాసనసభలో విశ్వాస పరీక్ష ప్రతిపాదనను ప్రవేశపెట్టారు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ ధరివాల్.
13:02 August 14
శాసనసభలో నిజమే గెలుస్తుంది: గహ్లోత్
శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
"ఇవాళ శాసససభ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాజస్థాన్ ప్రజలకు గెలుపు తథ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఐక్యత విజయం సాధిస్తుంది. అంతిమంగా సత్యానిదే గెలుపు."
- అశోక్ గహ్లోత్
11:27 August 14
అసెంబ్లీ వాయిదా..
రాజస్థాన్ శాసనసభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేశారు స్పీకర్.
11:27 August 14
అసెంబ్లీకి చేరిన నేతలు..
రాజస్థాన్‌లో శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శాసనసభకు కీలక నేతలు చేరుకున్నారు. భాజపా నేత వసుంధర రాజే, కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్ తదితరులు అసెంబ్లీకి వచ్చారు.
11:12 August 14
బల పరీక్షకు కాంగ్రెస్ సిద్ధం!
రాజస్థాన్‌లో బలపరీక్ష!
గత కొన్ని రోజులుగా రాజకీయంగా సెగలు పుట్టించిన రాజస్థాన్ రాజకీయాలు చివరి మజిలీకి చేరుకున్నాయి. అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ విశ్వాస పరీక్షకు సిద్ధం కాగా.. ప్రతిపక్ష భాజపా అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించింది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపా నేత వసుంధరా రాజే గవర్నర్‌ను కలిశారు.