తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిశువుల మృత్యుఘోష: రాజస్థాన్​లో మరో 10 మంది - child deaths at bundi hospital

రాజస్థాన్ కోటాలో శిశు మరణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే.. పక్కనే ఉన్న బూందీ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో పది శిశు మరణాలు సంభవించినట్లు బయటపడింది. డిసెంబర్​లో 10 మంది చిన్నారులు మృత్యువాత పడటం కలవరపెడుతోంది.

rajasthan-10-infants-die-within-month-in-hospital-in-bundi
శిశువుల మృత్యుఘోష: రాజస్థాన్​లో మరో 10 మంది

By

Published : Jan 4, 2020, 11:37 AM IST

Updated : Jan 4, 2020, 11:55 AM IST

శిశువుల మృత్యుఘోష: రాజస్థాన్​లో మరో 10 మంది

వందకు పైగా చిన్నారులను బలిగొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన రాజస్థాన్​ కోటాలోని జేకే ఆసుపత్రి నిర్లక్ష్యం సంగతి తేలకముందే.. పక్క జిల్లా బూందీలోని మరో ప్రభుత్వాసుపత్రి వైనం బయటపడింది. డిసెంబర్​లోనే ఈ ఆసుపత్రిలో 10 శిశు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఆగని 'కోటా' మరణాలు.. సమస్యకు పరిష్కారమేది!

ఈ మరణాల్లో వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరక ముందే చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందనీ, తమ వైద్యంలో లోపంలేదని అంటున్నారు వైద్యులు.

"డిసెంబర్​ నెలలో... పది మంది పిల్లలు మరణించారు. వారంతా వేర్వేరు వ్యాధుల వల్ల చనిపోయారు. ఆసుపత్రికి తీసుకొచ్చే ముందే వారి పరిస్థితి విషమంగా ఉంది. అందుకే ఈ మరణాలు సంభవించాయి. వీరిలో కొందరు బయటి ఆసుపత్రుల సూచన మేరకు ఈ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వీరిలో కొందరు తక్కువ బరువు, శ్వాస కోశ వ్యాధులు, మురికి నీరు తాగడం వల్ల మృతి చెందారు. "
- హితేష్​ సోనీ, ఆసుపత్రి ఇన్​ఛార్జి

విషయం తెలియగానే జిల్లా అదనపు పాలనాధికారి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి నివేదిక స్వీకరించి.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: మనసున్న 'మీరా'లక్ష్మి .. పేదలకు రూ.300 కోట్ల ఆస్తి దానం!

Last Updated : Jan 4, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details