క్లీన్ షేవ్, తలపై ఓ గుండ్రటి టోపీ, కాస్త చిన్న కళ్లు... ఈ పోలికలు చూడగానే గుర్తొచ్చేది యాక్షన్ కింగ్ జాకీచాన్. కానీ, ఇకపై రాజస్థాన్ కు చెందిన ఓ రాజకీయనాయకుడు కూడా గుర్తొస్తారు. ఎందుకంటే, నాగౌర్ జిల్లా, మక్రానా శాసన సభ్యుడు రూపారామ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 'జాకీచాన్' అయిపోయారు. జాకీచాన్ ఫొటో పక్కన రూపారామ్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నారు.
రాజస్థాన్ రాజకీయాల్లో 'జాకీచాన్' హల్చల్! - mla ruparam jackie chan photos
రాజస్థాన్ రాజకీయల్లో ఇప్పుడు 'జాకీచాన్' సందడి చేస్తున్నారు. ఓ భాజపా శాసన సభ్యుడి ఫొటోలే ఇందుకు కారణం. అదేంటీ అనుకుంటున్నారా? అవును మరి, అచ్చం జాకీచాన్ కు నకిలీలా కనిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ రాజకీయాల్లో 'జాకీచాన్' హల్చల్!
వ్యంగ్యాస్త్రాలు, కవితలతో రాజస్థాన్ శాసనసభలో నవ్వులు పూయించే నాయకుడు రూపారామ్. అంతే కాదు, ఆయన ఓ మంచి గాయకుడు కూడా. అవకాశం వస్తే వేదికేదైనా పాటలు పాడేందుకు వెనకడుగు వేయరు. వినూత్న వస్త్రధారణకు కూడా ఆయన ఫేమస్. ఆయన ధరించే దుస్తులు జాకీచాన్ మాదిరి కనిపించడం వల్ల సామాజిక మాధ్యమాల్లో 'భాజపా కా జాకీచాన్'గా వైరల్ అయ్యారు. తనను, ఇలా జాకీచాన్ తో పోల్చడం చూసి సంతోషించారు రూపారామ్.