తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10వేల మొక్కలు నాటిన 91ఏళ్ల 'ట్రీ బాబా' - bose

రాజస్థాన్​ సీకర్​ జిల్లాలోని ఓ గ్రామంలో గత 3 దశాబ్దాల కాలంలో ఏకంగా 10వేల మొక్కలు నాటి 'ట్రీ బాబా'గా ప్రసిద్ధి చెందారు 91ఏళ్ల మన్​రూప్​ జేదూ. పచ్చదనాన్ని పెంపొందించేందుకు సంకల్పించి విజయం సాధించారు.

10వేల మొక్కలు నాటిన 91ఏళ్ల 'ట్రీ బాబా'

By

Published : Jun 11, 2019, 6:02 AM IST

10వేల మొక్కలు నాటిన 91ఏళ్ల 'ట్రీ బాబా'

రాజస్థాన్​లోని సీకర్ జిల్లా బాస్ గ్రామానికి చెందిన 91 ఏళ్ల మన్​రూప్ జేదూ 'ట్రీ బాబా'గా సుప్రసిద్ధులు. గత 31 ఏళ్లలో 10 వేల మొక్కలను నాటారాయన. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి పెద్ద చెట్లుగా చల్లని గాలిని ప్రజలకందిస్తున్నాయి. స్వగ్రామంలోనే వెయ్యి మొక్కలను నాటారు బాబా. మొక్కల ఆలనా పాలనా ఆయనే చూశారు.

8 జిల్లాల్లోని 70 గ్రామాల్లో రావి, నిమ్మ, ఇతర చెట్లు నాటారు బాబా. ప్రస్తుతం అవి పెద్దవై ఫలసాయంతో పాటు నీడనిస్తున్నాయి. తన స్వగ్రామంలోని శంసాన్ ఘాట్​గా పిలిచే ప్రదేశం సహా వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి చెట్లుగా మారాయి. తాను నాటిన మొక్కలకు 91 ఏళ్ల వయస్సులోనూ నీళ్లు పోస్తారు మన్​రూప్ బాబా. నీళ్లు పోస్తూనే తన దినచర్యను ప్రారంభిస్తారు.

మన్​రూప్ బాబాకు ఆయుర్వేదంలోనూ ప్రవేశం ఉంది. బాబా ఆయుర్వేద మొక్కలను కొనుగోలు చేసి గ్రామంలో నాటుతుంటారు. ఇందుకు ఆయన ఎవరి నుంచీ ఎలాంటి సహాయం తీసుకోరు.

చెట్లు పెంచాలనే ప్రేరణ తనకు 31ఏళ్ల క్రితమే కలిగిందని తెలిపారు ​బాబా. అప్పుడు కొంత మంది పెద్ద పెద్ద చెట్లు నరుకుతుంటే వద్దని చెప్పినా వినలేదని, అప్పటి నుంచే గ్రామమంతా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:తండ్రి గౌరవం ముందు డబ్బు గడ్డిపరకైంది!

ABOUT THE AUTHOR

...view details