తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మిర్చి' కేసులో నటి శిల్పాశెట్టి భర్తకు చిక్కులు - Raj Kundra appears before ED

గ్యాంగ్​స్టర్​ ఇక్బాల్​ మిర్చికి సంబంధించిన మనీ లాండరింగ్​ కేసులో వ్యాపారవేత్త, ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్​ కుంద్రాకు చిక్కులు తప్పటం లేదు. విచారణ కోసం ముంబయిలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కార్యాలయం ముందు బుధవారం హాజరయ్యారు కుంద్రా.

'మిర్చి' కేసులో నటి శిల్పాశెట్టి భర్తకు చిక్కులు

By

Published : Oct 30, 2019, 3:53 PM IST

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​కుంద్రా ముంబయిలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) ముందు నేడు హాజరయ్యారు. గ్యాంగ్​స్టర్​ ఇక్బాల్​ మిర్చికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి వచ్చారు కుంద్రా.

నవంబర్​ 4న హాజరుకావాలని కుంద్రాను ఈడీ ఆదేశించింది. అయితే.. అదే సమయంలో ఇతర పనులు ఉన్న కారణంగా ముందుగానే హజరవుతానని కోరారు కుంద్రా. నేడు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. కుంద్రాను ప్రశ్నించిన ఈడీ.. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలం రికార్డ్​ చేసింది.

ఇదీ కేసు..

అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ మిర్చి, అతని కుటుంబంపై ఆర్థిక అక్రమాల కేసు నమోదు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ముంబయిలో ఖరీదైన స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకంలో అక్రమ లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది.

2013లో లండన్​లో చనిపోయాడు మిర్చి.

ఈ కేసుకు సంబంధించి మిర్చి కుడిభుజంగా భావించే రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో కుంద్రా చేసిన లావాదేవీలను దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారం లభించిన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. కొన్ని రోజుల క్రితం బింద్రాను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

ఈ వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కుంద్రా గతంలో స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: మహా భాజపా శాసనసభాపక్ష నేతగా మరోసారి ఫడణవీస్

ABOUT THE AUTHOR

...view details