తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​ గవర్నర్​పై ఈసీ ఆగ్రహం - Kalyan Singh

మోదీకి మద్దతుగా రాజస్థాన్​ గవర్నర్​ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యలు చేయటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహరించిన తీరు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ప్రకటించింది. ఇదే విషయంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు ఫిర్యాదు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది.

రాజస్థాన్​ గవర్నర్​పై ఈసీ ఆగ్రహం

By

Published : Apr 2, 2019, 8:26 PM IST

ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా రాజస్థాన్​ గవర్నర్ కళ్యాణ్​ సింగ్ వ్యాఖ్యలు చేయటంపై​ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న కళ్యాణ్​ ఎన్నికల నియమాళికి విరుద్ధంగా వ్యవహరించారని తప్పుబట్టింది. ఈ విషయంపై రాష్ట్రపతిరామ్​నాథ్​ కోవింద్​కు ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాయనున్నారని సమాచారం.

గత నెలలో పార్టీ టికెట్​ కోసంపెద్ద సంఖ్యలో భాజపా కార్యకర్తలు కళ్యాణ్​ సింగ్​ను సంప్రదించారు. అలీగఢ్​లోని గవర్నర్​ నివాసం ముందు నిరసనలు కూడా చేపట్టారు. వారిని శాంతింపజేసేందుకు మోదీకి మద్దతుగా కళ్యాణ్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

" మనమందరం భాజపా కార్యకర్తలం, మరోసారి మోదీ ప్రధాని అయ్యే దిశగా కృషి చేయాలి. మోదీ ప్రధాని కావటం అత్యవసరం."
- కళ్యాణ్​ సింగ్​, రాజస్థాన్ గవర్నర్​

1990లో హిమాచల్​ ప్రదేశ్ గవర్నర్​గా బాధ్యతలు నిర్వర్తించిన గుల్​షెర్​ అహ్మద్​ కూడా ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నారు. తన కొడుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు అహ్మద్​ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు గుల్​షెర్​ అహ్మద్.​

ఇదీ చూడండి :తెలుగు సహా 9 భాషల్లో వెబ్​సైట్​ పూర్తిపేరు!

ABOUT THE AUTHOR

...view details