తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లిలో 100 మంది దాటితే రూ.25వేల జరిమానా - రాజస్థాన్​లో కరోనా నిబంధనలు

రాజస్థాన్​లో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా నిబంధనలను కఠినతరం చేశారు. వివాహ వేడుకల్లో పరిమితికి మించి అతిథులు హాజరైతే.. రూ.10 వేలుగా ఉన్న జరిమానాను రూ.25 వేలకు పెంచారు. మాస్కు ధరించకపోతే రూ.500 జరిమానాను వసూలు చేయనున్నారు.

marriages
పెళ్లి

By

Published : Nov 23, 2020, 10:26 AM IST

రాజస్థాన్​లో కరోనా నిబంధనలను కఠినతరం చేశారు. నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాను భారీగా పెంచారు. వివాహ వేడుకల్లో 100 మందికి పైగా హాజరైతే ప్రస్తుతం పది వేలుగా ఉన్న జరిమానాను రూ.25 వేలకు పెంచుతున్నట్లు సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు.

మాస్కు ధరించకపోతే రూ.500 (ఇంతకుముందు రూ.200)కు పెంచారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు రాత్రి కర్ఫ్యూను పునరుద్ధరించారు గహ్లోత్. ప్రజలందరూ నిబంధనలు పాటించేలా అధికారులు, పోలీసులు నిత్యం పర్యవేక్షణ చేపట్టాలని గహ్లోత్ ఆదేశించారు.

ఇదీ చూడండి:టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి

ABOUT THE AUTHOR

...view details