రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో.. నేడు మరోమారు శాసనసభా పక్ష సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. జైపుర్ శివారులో.. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్కు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలు బసచేస్తున్న హోటల్లో ఈ సమావేశం జరగనుందని సమాచారం. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయన్న దానిపై అస్పష్టత నెలకొంది.
వారం రోజుల వ్యవధిలో సీఎల్పీ సమావేశం జరగడం ఇది మూడోసారి.
ఇదీ చూడండి:-'ఆడియో టేప్'పై కేంద్ర మంత్రికి నోటీసులు