భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజీనా సదస్సు దిల్లీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయింది. భౌగోళిక, రాజకీయ అంశాలపై 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.
రైజీనా డైలాగ్: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై చర్చ - రైజీనా డైలాగ్
భౌగోళిక, రాజకీయ అంశాలపై భారత్ నిర్వహిస్తున్న 'రైజీనా డైలాగ్' దిల్లీలో మంగళవారం ప్రారంభమయింది. ప్రధాని మోదీతో పాటు డెన్మార్క్, న్యూజిలాండ్ ప్రధానులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
![రైజీనా డైలాగ్: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై చర్చ MEA-RAISINA DIALOGUE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714403-thumbnail-3x2-raisina.jpg)
MEA-RAISINA DIALOGUE
మోదీతో పాటు డెన్మార్క్ ప్రధాని అండర్స్ రసముసెన్, న్యూజిలాండ్ ప్రధాని హెలెన్ క్లార్క్, 7 దేశాల మాజీ అధినేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆఫ్గాన్ శాంతికి చొరవ, వాతావరణ మార్పులపై చర్చించారు.
ఇదీ చూడండి: నేటి నుంచి 'రైజీనా డైలాగ్'- ప్రారంభోత్సవానికి మోదీ
Last Updated : Jan 15, 2020, 8:52 AM IST