భారీ సెట్టింగ్‌లు, అదిరిపోయే అలంకరణలు, పూల పందిళ్లు, అతిథుల కోలాహలం, డీజే హోరు.. వెరసి సినిమా సెట్టింగ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తమ పెళ్లి వేడుకను నిర్వహించుకునేందుకు ఒక యువ జంట ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 8 వేల మంది అతిథుల సమక్షంలో ఒక్కటవ్వాలని అవినాశ్, కీర్తిలు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నారు. మూడున్నరేళ్లుగా ఆ శుభ గడియ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ జంట ఆశలపై లాక్‌డౌన్ నీళ్లు చల్లింది.
బరేలీలో వధువు.. ముంబయిలో వరుడు - dj
ఇటీవల ఓ యువ జంట.. భారీ సెట్టింగ్‌లు, పూల పందిళ్లు, డీజే హోరు నడుమ అత్యంత ఘనంగా పెళ్లి వేడుకను నిర్వహించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అయితే.. కరోనా లాక్‌డౌన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఏదేమైనా అనుకున్న ముహూర్తానికి వివాహం చేసుకోవాలని నిశ్చయించిన ఆ జంట.. ఇంటర్నెట్ సాక్షిగా ఒక్కటైంది. లైవ్ టెలికాస్టింగ్ ద్వారా బంధువులు పెళ్లికి హాజరయ్యారు.
ఎలాగైనా సరే ముందు నిర్ణయించిన ముహూర్తానికే వివాహం చేసుకోవాలని నిశ్చయించిన ఆ యువజంట ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ టెలికాస్టింగ్) ద్వారా పెళ్లి వేడుకను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది.
అమ్మాయి అక్కడ బరేలి (ఉత్తర్‌ప్రదేశ్)లో.. అబ్బాయి ముంబయిలో ఉండగా.. రాయిపుర్ (ఛత్తీస్‌గఢ్)లో ఉన్న పురోహితుడు వేద మంత్రాలతో.. ఇంటర్‌నెట్ సాక్షిగా లైవ్‌లో ఇటీవల వీరి పెళ్లిని జరిపించారు. బంధువులంతా తమ ఇళ్లల్లో నుంచే వివాహాన్ని వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు. 10 దేశాలకు చెందిన 16 వేల మంది ఈ పెళ్లి వేడుకను తిలకించారని నిర్వాహకులు పేర్కొన్నారు.