దేశ ఆర్థిక రాజధాని ముంబయిని మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని వీధుల్లో వరద నీరు చేరింది. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే పాఠశాలలకు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాకపోకలకు అంతరాయం
మేఘాలు దట్టంగా ఉండటం వల్ల విమానాల రాకపోకలు స్తంభించాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 20 నిమిషాల పాటు రన్‌వే మూసివేశారు. 3 విమానాలను దారి మళ్లించారు. ఘట్కోపార్, కంజూర్‌మార్గ్, సియాన్ రైల్వే స్టేషన్ల పరిధిలో పట్టాలపై భారీగా నీరు చేరింది. ఫలితంగా లోకల్ ట్రైన్లు నెమ్మదిగా నడుస్తున్నాయి.