దిల్లీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనితో అనేక ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. అయితే ఇకపై మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తోంది భారత వాతావరణశాఖ (ఐఎండీ).
మధ్య దిల్లీ, ఈశాన్య దిల్లీ, షాహధారా, ముండకా, రోహిణి, బవానా పరిసర ప్రాంతాల్లో ఉరుములతో, ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి.