ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు ఇలానే కొనసాగితే రెండు రోజుల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు.
సిక్కిం- డార్జిలింగ్ రహదారి బంద్!
కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో పశ్చిమ బంగ-సిక్కిం రాష్ట్రాలను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి.