సెప్టెంబర్ 1(సోమవారం) నుంచి భారత ద్వీపకల్పంలో వర్షపాతం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు: ఐఎండీ - september rains india
సోమవారం నుంచి దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు వాయవ్య భారతదేశం, పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు: ఐఎండీ
సెప్టెంబర్ 1న పశ్చిమ రాజస్థాన్లో విస్తృతంగా వర్షాలు పడతాయని పేర్కొంది ఐఎండీ. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వాయవ్య భారతదేశంతో పాటు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి-'అమర వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!'